Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కేపీ వివేకానంద
- పలు కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
ప్రజల కోసమే ప్రగతి యాత్ర చేపట్టినట్టు ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ 130 డివిజన్లో ప్రగతి యాత్రను మంగళవారం ఎమ్మెల్యే చేపట్టారు. ఈ మేరకు రామిరెడ్డి నగర్ మీదుగా ఆయన పాదయాత్ర చేస్తూ అపురూప కాలనీ, ఎస్.ఆర్. నాయక్ నగర్, మోడీ బిల్డర్స్, జనప్రియ అపార్ట్మెంట్స్లలో చేపట్టిన అభివద్ధి పనులను పరిశీలించి, అక్కడక్కడ నెలకొన్న సమస్యలను తెలుసు కున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని తెలుసుకున్నారు. ఎస్.ఆర్.నాయక్ నగర్లో రూ 1.52 కోట్లతో చేపడుతున్న ఇండోర్ షటిల్ కోర్టు పనులు, రామ్ రెడ్డి నగర్ లో రూ.30 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగారావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు మన్నె రాజు, వెంకటస్వామి వెంకటేష్ కాలనీ అధ్యక్షులు వామన గుప్తా, శ్రీనివాస్ రావు, బాలరాజు , గణేష్ , రమణ , తిప్పారెడ్డి , శ్రీనివాస్ శేషాచారి గోపాల్ రెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దుండిగల్ : దుండిగల్ మున్సిపాల్టీ పరిధిలోని భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో మంచినీటి సమస్యపై ఎమ్మెల్యే కేపి వివేకా నంద స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం పర్యటిం చారు. ఈ మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే మంచినీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో స్థానిక కౌన్సిలర్ వనిత బుచ్చిరెడ్డి, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కుంట అనిల్ ఇటీవల ప్రమాదవశాత్తు కింద పడి ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సంద ర్భంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.