Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కూకట్పల్లి
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ 34, 35 బ్లాక్స్, కమల ప్రసన్ననగర్, వెంకటేశ్వర నగర్ వికర్ సెక్షన్ కాలనీ, మాధవరం నగర్ బీ, సీ బ్లాక్ కాలనీలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. కాలనీల రక్షణ కోసం, మహిళల భద్రత, దొంగతనాల నివారణ కోసం, గొలుసు దొంగతనాలు అరిట్టేందుకు, పోకిరీల బెడద వంటి సమస్యల పరిష్కారం కోసం కాలనీలలో ప్రశాంత వాతావరణం కోసం కాలనీలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కషి చేయాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తప్పకుండా కృషి చేస్తానని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. కాలనీలలో తప్పకుండా ప్రశాంత వాతావరణం కల్పిస్తామని ,దొంగతనాలు, పోకిరీల బెడద అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. 24 గంటల పాటు నిరంతరం పనిచేసే నిఘా నేత్రాలను ప్రతి కాలనీ, బస్తీలో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.