Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
భగత్ సింగ్ ఒక విప్లవకారుడే కాక గొప్ప మానవతావాది, హేతువాది, దేవుని అస్థిత్వాన్ని నమ్మని గొప్ప మేధావి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి అన్నారు. సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కమలానగర్ ఆఫీసులో భగత్ సింగ్ ఆశయాలపై రెడ్ బుక్ డే ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించి ప్రారంభించారు. కోమటి రవి మాట్లాడుతూ.. భగత్ సింగ్ వీలునామాపై సవివరంగా, చిన్ననాటి తను చదివిన ఆ పుస్తకము వివరాలను, దానితో ప్రేరేపించినటువంటి విధానాలను వివరించారు. భగత్ సింగ్ ఒక విప్లవకారుడే కాక గొప్ప మానవతావాది, హేతువాది, దేవుని అస్థిత్వాన్ని నమ్మని గొప్ప మేధావి అని అన్నారు. భారతదేశ విముక్తి కోసం జీవితాన్నే పణంగా పెట్టి భారత ప్రజలను ఉత్తేజపరిచారు అన్నారు. నేటికీ భారత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని చెప్పారు. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ భగత్ సింగ్ అనుచరుడు శివవర్మ రాసిన భారత విప్లవ కెరటం భగత్ సింగ్ అనే పుస్తకంలో భారతదేశంలో విప్లవం పట్ల భగత్ సింగ్ అవగాహన అనే అంశంపై సవివరంగా వివరించారు. జి శివరామకృష్ణ మాట్లాడుతూ.. తన జీవి తం.. సిద్ధాంతం కన్నా గొప్పది కాదు అన్న భగత్ సింగ్ ఉత్తరాన్ని ప్రస్తావించారు తన తండ్రి చేసిన అప్పీలను తిరస్కరిస్తూ బ్రిటిష్ పాలకులకు నేనెప్పుడూ వివరణ సంజా యిషులు ఇవ్వనని ఘంటాపధంగా చెప్పిన విషయాన్ని చెప్పారు. భగత్ సింగ్ ఆశయాలను నేడు వక్రీకరించి మతతత్వవాదులు చిత్రీకరిస్తున్నారని వాటికి వ్యతిరేకంగా ప్రజలందరూ గట్టిగా నిలబడాలని అధ్యక్షులు యాదగిరి రావు కోరారు. ఈ సందర్భంగా భగత్ సింగ్కు నివాళులర్పి స్తూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, వెంకట్రామయ్య, బసవ పున్నయ్య , జి శివరామకృష్ణ , ఆర్ ఎస్ ఆర్ ప్రసాద్ , శోభ , గౌసియా తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి : సీపీఐ(ఎం) మల్కాజిగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో రెడ్ బుక్ డేను పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి కపాసాగర్ ప్రసంగిస్తూ, ఎరుపు పట్టుదలకు పోరాటానికి, త్యాగానికి గుర్తు అని వివరించారు. మార్క్స్, ఏంగెల్స్ యావత్ ప్రపంచాన్ని పరిశీలించి, అధ్యయనం చేసి, ప్రపంచం అంతటా బూర్జువా పాలనే కొనసాగుత ున్నదని... దీన్ని బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందని 172 సంవత్సరాల క్రితం చెప్పారన్నారు. ఈ దోపిడీ వ్యవస్థ మారాలని, కుల,మత రహిత సమాజం ఉండాలని, ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని, ప్రకతి వనరులన్ని ప్రభు త్వం చేతిలో నే కొనసాగాలని, విద్య,వైద్యం ప్రతి పౌరునికీ అందాలని, కీలక మైన రంగాలు, ఆదాయ వనరులు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, ఈ మహనీయులు కమ్యూ నిస్టు ప్రణాళికను రచించి ,లోకానికి అందించారని తెలిపారు. ఈ దోపిడీ వ్యవస్థ మారాలని అందుకు కార్మిక వర్గ నాయకత్వంలో కార్మిక, కర్షక పోరాటాలు నిర్వహిం చాలని పిలుపు ఇచ్చారు. ప్రజలకు చెందాల్సిన సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉండే లా పాలక వర్గాలు పూర్తిగా సహకారం అందిస్తున్నాయని తెలిపారు. అదాని అంబానీ లే దీనికి పెద్ద ఉదాహరణ అన్నారు. సెక్యులర్ భావాలు కలిగిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మత పరమైన సనాతన ధర్మాలను అశాస్త్రీయమైన మను ధర్మాన్ని అమలు చేసే కుట్రలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సమాజం మారాలంటే కమ్యూనిస్టు పార్టీ, అభ్యుదయ భావాలు కలిగి ఉన్న శక్తులు అధికారంలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బంగారు నర్సింగ్ రావ్, గుంటి లక్ష్మన్, ప్రజా సం ఘాల నాయకులు శ్రీనివాస్, సాయి షంతన్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.