Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛాతి నొప్పి, కాళ్లు తిమ్మిర్లతో కుప్పకూలిన విద్యార్థిని
- ఫస్ట్ ఏయిడ్ చేసి ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-నాచారం
ఫీజు చెల్లించలేదని నాచారం ఇందిరా స్కూల్ ఇంగ్లీష్ టీచర్ ప్రణీత పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ధరణిని చితక కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాచారం ఎర్రకుంటకు చెందిన ప్రేమలత కాయ కష్టం చేస్తూ ఒంటరిగా జీవిస్తూ పిల్లల్ని ఉన్నతంగా చదివిం చాలని లక్ష్యంతో నాచారం ఇందిరా ప్రయివేటు స్కూల్లో చదివి పిస్తుంది. ఫీజు కట్టడం ఆలస్యమైందని పాఠశాలకు హాజరుకాని విద్యారి ్థనిపై టీచర్ ప్రణీత క్లాసులోని పిల్లలం దరి ముందు చేయి చేసుకొని మెడపై కొట్టడంతో ఒక్కసా రిగా ఛాతి నొప్పి, కాళ్లు తిమ్మిర్లు వచ్చి ఆమె కుప్పకూలి పోయింది. దాంతో ఆందోళన చెందిన టీచర్ పాఠశాల పిఈటి శేఖర్ కు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన పాఠశాల నిర్వాహకులు ఫస్ట్ ఎయిడ్ చేసి. కొంత సమయం తర్వాత సమీపంలోని నాచారం ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థిని అన్న పాఠశాల యాజమాన్యం వద్దకు వెళ్లి విషయం తెలుసుకునే క్రమంలో పాఠశాల యాజమాన్య అన్వర్ పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని స్టేషన్లో కూర్చోబెట్టడంతో తన స్నేహితులకు సమా చారం ఇచ్చారు. దీంతో విషయం బయటకు పొక్కింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని జరిగిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా. ఈ నెల 17వ తేదీన టీచర్ ప్రణీత విచక్షణ కోల్పోయి క్లాసులో అందరి ముందు హేళన చేస్తూ తన చెంపపై కొట్టడంతో భయాం దోళనకు గురై పడిపోయానని బాధితురాలు పేర్కొంది. ఈ విషయాన్ని పాఠశాల నిర్వహకులకు చర్చించేందుకు విద్యార్థిని అన్న, అతని స్నేహితులు వెళ్లినం దుకు వారిపై దురుసుగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం పట్ల విద్యార్థిని తల్లి ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులు, విద్యార్థులతో కఠినంగా వ్యవహరిస్తూ గతంలో పలు సంఘటనలు చోటు చేసుకున్న బయటకు రానీయకుండా వ్యవహరించారని విద్యార్థిని తల్లి ప్రేమలత పేర్కొన్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందిం చి దాడిలో గాయపడిన తన బిడ్డకు తగిన న్యాయం చేయా లని కోరారు. పాఠశాల యాజమాన్యం తన కొడుకును స్నేహితులను పోలీస్ స్టేషన్లో పెట్టించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం పాఠశాల యాజమాన్యం చేస్తుందని ఆరోపించారు. విద్యా శాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయం కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు.