Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసరగుట్టలో ఆరు రోజుల పాటు జరిగిన మహా శివరాత్రి బ్రహ్మౌత్స వాలు మంగళ వారం మహా పూర్ణా హుతితో ముగిశాయి. చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశా లలో కలశ రూపంలోకి స్వామి వారిని ఆవాహన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆ కలశాలలోని పవిత్ర జలాలను భక్తులపై చల్లి స్వామి వారి ఆశీస్సులు అందజేశారు. అంతకు ముందు రుద్రయాగ సహిత బ్రహ్మౌ త్సవాలలో వేద విద్యార్ధులు క్షేత్రదిగతి నిర్వహించారు. భూరాశిలోని జీవకోటి సుభిక్షంగా ఉండాలని ప్రార్ధిస్తూ నిర్వహించిన బ్రహ్మౌత్సవాలు విజయవంతం అయ్యాయని ఈ సందర్భంగా బ్రహ్మౌత్సవాల వైదిక కార్యక్రమాల సర్వోపద్రష్ట టీటీడీ వేద పాఠశాల శైవ ఆగమ శాస్త్ర పండితులు పుల్లేటి కుర్తి గణపతి కర్మ, అలయ వేద పండితులు సత్యనారాయణ కర్మలు ప్రకటించారు. అనంతరం పండిత సన్మానం గావించారు. ఆలయ చైర్మెన్ తటకం రమేష్ శర్మ, ఈవో సుధాకర్ రెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త మండలి సభ్యులు తటకం నారాయణ శర్మ, వెంకటేష్ శర్మ, ఉమాపతి శర్మ , నాగలింగం శర్మ, ఆలయ పండితులు తదితరులు పాల్గొన్నారు.