Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- సనత్నగర్ రోడ్డు పనుల పరిశీలన
నవతెలంగాణ-సనత్నగర్/ బేగంపేట్
సనత్ నగర్ మెయిన్ రోడ్ విస్తరణ, డివైడర్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సనత్నగర్ మెయిన్ రోడ్డులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంతో రద్దీగా ఉండే ఈ రహదారి విస్తరణతో వాహనదారులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. సబ్ స్టేషన్ వద్ద కూడా రోడ్డు ఎంతో ఇరుకుగా ఉండేదని, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సబ్ స్టేషన్ స్థలం సేకరించడంతో రోడ్డు విశాలంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణ లో అడ్డంకిగా ఉన్న అక్రమ నిర్మాణాలు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశిం చారు. రోడ్డు, డివైడర్ల నిర్మాణం పూర్తయితే ఎలాంటి అసౌకర్యా నికి గురికాకుండా ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం దాసారం బస్తీలో మంత్రి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని కొందరు కోరగా మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వైద్యం కోసం ప్రయివేట్ హాస్పిటల్ కు వెళితే డాక్టర్ ఫీజు రూ. 500 వరకు, పరీక్షల కోసం రూ. 3 వేల నుండి రూ. 5 వేల వరకు ఖర్చవుతాయని మంత్రి చెప్పారు. ఈ బస్తీ దవాఖాన లో ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారని చెప్పారు. 64 రకాల వైద్య పరీక్షలు బస్తీ దవాఖాన లో చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. పేద ప్రజలకు మేలు చేసేందుకే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. బస్తీ వాసుల ఏకాభిప్రాయం తెలిపిన తర్వాతే బస్తీ దవాఖాన ఏర్పాటు పై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజల అభివద్ధి కోసం తాను నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు. తాను వచ్చిన తర్వాత ఎన్ని అభివద్ధి పనులు జరిగాయో, ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయో అందరికీ తెలిసిందేనని అరాంరకె, ఈ నెల 26వ తేదీన బస్తీ వాసులతో సమావేశం నిర్వహిస్తామని, బస్తీవాసులు ఏకాభిప్రాయం కు రావాలని అన్నారు. మంత్రి వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ మోహన్ రెడ్డి, ఈఈ ఇందిరా తదితరులు ఉన్నారు.