Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మంగళవారం అరణ్య భవనం లో భేటీ అయ్యారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లో గల ఇందూ అరణ్య ఫారెస్ట్‌లో ఉన్న కొంత స్థలాన్ని గోల్డెన్ లీవ్స్ విల్లాకు కేటాయించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. స్థలాన్ని కేటాయిస్తే ఆ స్థలంలో వాకింగ్ ట్రాక్, యోగ, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సుధీర్‌రెడ్డి వివరించారు. గోల్డెన్ లీవ్స్ విల్లాలో వందల సంఖ్యల కుటుంబాలు నివసిస్తున్నారని, దీంతో ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్, యోగ, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూమి లేకపోవడంతో ప్రజలు ఒకింత అసహనానికి గురవుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పక్కనే ఉన్న ఇందు అరణ్య ఫారెస్ట్‌లో కొంత స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులతో చర్చించి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే తానే స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరుగుతుందని తెలిపారు. మంత్రి స్పందన పట్ల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రిని కలిసిన వారిలో నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, గోల్డెన్ లీవ్స్ విల్లా సభ్యులతో పాటు పలువురు ఉన్నారు.