Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రవణ్ కుమార్
నవతెలంగాణ-కల్చరల్
సంగీతం లో పరిణతి కి జీవిత కాలం పడుతుందని ప్రభాకర్ చేసిన స్వర రాగ అవధానం అరుదైన ప్రక్రియ అని అభినందించారు. శ్రీత్యాగరాయ గాన సభ ప్రధాన వేదిక పై ఎస్. ఎస్.మ్యూజిక్ అకాడెమీ, వంశీ ఇంట ర్నషనల్, శుభో దయం గ్రూప్ నిర్వహణలో గరికపాటి వెంకట ప్రభాకర్ స్వర రాగ అవధానం రస భరితం సంగీత సౌరభలు వెదజల్లింది. శశి రేఖ, సురేఖ, శేషు బాబు, రాజన్, డాక్టర్ వీ.వీ.రామా రావు డాక్టర్ శివరాం ప్రసాద్,దుర్గ ,శ్రీవాణీలు పృచ్ఛకులుగా అవధాని ప్రభాకర్ ను స్వరరాగ ప్రశ్నలను సంధించగా సులువుగా సమాధానాలు చెప్పారు సభా కార్యక్రమం లో .ముఖ్య అతిథిగా జస్టిస్ శ్రవణ్ కుమార్ ప్రభాకర్‌ను సత్కరించి మాట్లాడారు. సంగీతానికి భాష సరిహద్దు లేవని ప్రభాకర్ మరిన్ని ప్రయోగాలు చెయలని అన్నారు సాహితీ వేత్త వోలెటి పర్వ్యతీసం మాట్లాడుతూ అవధానం అంటే ఏకాగ్రత అని ప్రభాకర్ స్వర అవధానం లో విజేత అయినారని కొని యాడారు. ఆకాశవాణి సంచాలకుడు ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొనగా వంశీ, రామ రాజు అధ్యక్షత వహించారు.