Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జీటీఏ పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థి కాసం ప్రభాకర్ 2 వ సెట్ నామినేషన్ గురువారం జీహెచ్ ఎంసీ కార్యాలయంలో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేరోజు. బ్రహ్మాచారి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దశరథ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఉస్నాబాద్. రమేష్ గౌడ్, హైదరాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి కృష్ణారావు, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పండాల రాజు పాల్గొ న్నారు. ప్రతీ ఒక్క ప్రభుత్వ ఉపాధ్యా యుడు కాసం ప్రభాకర్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేసి, రెండు, మూడు ప్రాధాన్యత ఓటు ఎవరికీ వేయకుండా ఈ సారి ప్రభు త్వ ఉపాధ్యాయుల సత్తా చూపిం చాల్సిన బాధ్యత మనందరి పై ఉన్నదని వారు అన్నారు. మల్టీ జోన్, జోనల్ సమస్యలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, పదోన్నతుల కోసం శాశ్వత పరిష్కారం కావాలంటే జీటీఏ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు.