Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నాచారం
నాచారం డివిజన్ పరిధిలోని ఓల్డ్ విలేజ్ లో భూగర్భ డ్రయినేజీ నిర్మాణం కోసం నిధులు కేటాయిం చాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. నాచారం ఓల్డ్ విలేజ్‌లో గ్రామపంచాయతీ కాలంనాటి డ్రయినేజీ పైప్ లైన్లు కావడంతో నిత్యం మ్యాన్ హౌల్స్ పూడి సమస్యాత్మకంగా మారుతున్నాయని వివరిం చారు. వెంటనే నిధులు మంజూరు చేస్తే నూతన భూగర్భ డ్రయినేజీ నిర్మాణం చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ కార్పొరేటర్ ప్రభుదాస్, మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్ పాల్గొన్నారు.