Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
ఆర్కే పురం డివిజన్ పరిధిలోని వాసవి కాలనీ అష్టలక్ష్మి దేవాలయ అభివద్ధికి కషి చేస్తున్నట్టు అష్టలక్ష్మి ఆలయ కమిటీ ట్రస్ట్ ఫౌండర్ చైర్మెన్ గౌరిశెట్టి చంద్రశేఖర్ గుప్తా తెలిపారు. గురువారం దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం దేవాలయ ముఖ ద్వారము, స్వర్ణ రథం అవిష్కరణ, ప్రధాన సన్నిధిలో శ్రీమహాలక్ష్మి స్వర్ణ యంత్ర స్థాపన ఉత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిలుగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీ యర్ స్వామి హాజరవుతున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.కమిటీ సభ్యులందరూ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంప జగన్, కోశాధిక ారి ఐత అంజయ్య గుప్తా, ఉపాధ్యక్షులు సోమా సురేష్, కాలనీ వాసులు చిలుక ఉపేందర్ రెడ్డి, ఈసీ మెంబెర్స్ ఉమాపతి, మాలే అనిల్, శ్రీధర్, శ్రవణ్ పాల్గొన్నారు.