Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలోని జెడ్.పి రోడ్ వై జంక్షన్ వద్ద ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డివిజన్ అధ్యక్షులు పి. నరేష్ యాదవ్ అన్నారు. విగ్రహాన్ని ఆపహరిం చారంటూ గురువారం హుటహుటీన సంఘటన స్థలానికి చేరుకున్న బీజేపీ డివిజన్ కమిటీ నాయకులు నిరసన చేపడుతూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని రాత్రికి రాత్రే అపహరించడం దుర్మార్గమని అన్నారు. మహనీయుల విగ్రహాలకు కనీస రక్షణ కల్పించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. అనంతరం ధర్నా చేస్తున్న నాయకులను మీర్పేట్ ఠానా కు తరలించారు.దోషులను పట్టుకొని శిక్షించాల్సిన అధికార యంత్రాంగం బి.జే.పి నాయకులను అరెస్ట్ చేయడం అప్రజస్వామికమని, రాజకీయంగా తమను ఎదుర్కోలేక ఇలాంటి దుర్మార్గమైన ఘటనలకు పాల్ప డుతున్నారని అలాంటి వారికి తగిన గుణపాఠం చెబుతామని నరేష్ యాదవ్ అన్నారు. అరెస్టయిన వారిలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నరేష్ యాదవ్ తో పాటు బి.జే.వై. ఏం డివిజన్ అధ్యక్షుడు పాశం జీవన్ రెడ్డి, నాయకులు రాధ కష్ణ,కోట్ల శివ, గోవర్ధన్,రాజేష్‌లు ఉన్నారు. అనంతరం నాయకులను పరామర్శించడానికి బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు,అమరేందర్ రెడ్డి, శశి నాయకులు మీర్ పేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.