Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ప్రపంచంలోనే అతిపెద్ద బీమాపథకం ఆయుష్మాన్ భారత్ అని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావనివినయ్ కుమార్ అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్ష ణ సౌకర్యాల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారతంతో ఉపయోగపడుతుందన్నారు. భారత్ ఆరోగ్య భీమా హెల్త్ కార్డ్ జవహర్నగర్ టీఆర్ గ్రౌండ్ బస్తీ దవా ఖాన వద్ద గురువారం ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ నమోదు, లబ్దిదారులకు ఐడీ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరై ఆమె మాట్లాడారు. సమాజంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్లో చికిత్స సేవలను పొందేందుకు ఉపయోగించే ఈ కార్డ్ ఉచితంగా పొందాలనుకుంటే తెల్ల రేషన్ కార్డులో పేరు నమోదు ఉన్న ప్రతి ఒక్కరితోపాటు పాటు బట్టలు ఉతికేవాళ్ళు, చౌకీదార్లు, చినిగిన బట్టలు ఏరుక అనేవారు, మెకానిక్లు, ఎలక్ట్రిషియన్లు, ఇళ్ళల్లో పనిచేసేవారు, చేతివృత్తులు చేసుకునేవారు, హస్తకళాకార్మికులు, కుట్టుపనివారు, చెప్పులు కుట్టేవారు, తోపుడుబండ్లపై వ్యాపారాలు చేసుకు నేవారు, భవననిర్మాణ కూలీలు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, వాహనాలు నడిపే డ్రైవర్లు, రిక్షాతొక్కేవారు, డెలీవరీ బార్సు, వెయిటర్లు, అందరూ లబ్దిదారులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎ. వినయకుమార్, రత్నసాయిచంద్, శ్రీకాంత్, దామోదర్, శివకృష్ణ, ప్రవీణ్, బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.