Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలనీ, ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కరెన్సీ పై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరుశురామ్ పార్లమెంటు సభ్యులను డిమాండ్ చేస్తూ కరెన్సీ నోట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ప్రజా పోరు రధ యాత్ర ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు పిబ్రవరి 1న విశాఖపట్నం బీఆర్ అంబేద్కర్ భవన్ నుండి ప్రారంభమై గురువారం ఓయూ లా కళాశాల చేరుకుంది. రథయాత్రకు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, లా కళాశాల డీన్ డాక్టర్ ప్రొ.గాలి వినోద్ కుమార్, దళిత సేన జాతీయ అధ్యక్షులు జేబీ రాజు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ సలహాదారులు ఆళ్ల రామకృష్ణ, దళిత సంఘాల నాయకులు గొల్లపల్లి దయానంద్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రుద్రవరం లింగస్వామి, టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు కే విజయ రావు, ఏఐఎస్ఎఫ్ ఓయూ సెక్రెటరీ నెల్లి, వైయస్సార్ టీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ నాగరాజు. టీఎస్ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు నాగరాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పొన్నాల బాబు విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జేరిపోతుల పరశురామ్ ఉద్యమాన్ని అభినందిస్తూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రథ యాత్ర సారథులు బానోతూ రవి, సముద్రాల ప్రశాంత్, జేరిపోతుల ప్రశాంత్, పిడుగు ఆశీర్వాదం, మిద్దెపాక రాజు, మల్లెపాక శ్రీకాంత్, దళిత సంఘాల నాయకులు బి.భాస్కర్ వంకతారా శ్రీను, ఆర్.వాస్, కె.స్వర్ణ, కె.స్వప్న, ఆర్.కమలకుమార్, ఉగ్గామ్ సంబశివారవు, వి.సత్తి బాబు పాల్గొన్నారు.