Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
డాక్టర్ ధారావత్ ప్రీతిని మానసికంగా హింసించి సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపించిన ఎంజీఎం డైరెక్టర్, ప్రిన్సిపాల్, కొందరు సీనియర్ విద్యార్థులను విధుల నుంచి వెంటనే బహిష్కరించాలి అని లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు విస్లావత్ అశోక్ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమైనదన్నారు. ఇప్పుడిప్పుడే భావ్య సమాజంలోకి వస్తున్న గిరిజనులు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారన్నారు. ప్రీతి ఎంతో కష్టపడి పీజీ మొదటి సంవత్సరం చదువుతుంటే అక్కడున్న కొందరు డాక్టర్లు, ప్రొఫెసర్లు, సీనియర్ విద్యార్థులు సంబంధిత ప్రిన్సిపాల్ ఆమెను మానసికంగా హింసించి ఇబ్బంది పెట్టారన్నారు.