Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
లో ప్రెషర్ నీటి సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలనీ, అధికారులు దృష్టి సారించాలని బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ బి పద్మ వెంకట్రెడ్డి అన్నారు. గురువారం బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని ఎస్బీహెచ్ కాలనీలో తక్కువ ఒత్తిడి మంచినీటి సరఫరా జరుగుతున్నదని స్థానికులు ఇచ్చిన ఫిర్యా దుకు స్పందించిన కార్పొరేటర్ వాటర్ వర్క్స్ లైన్ మెన్స్ ప్రేమ్, కమలాకర్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ డిడి కాలనీ ఎస్బిహెచ్ కాలనీలో తక్కువ వత్తిడితో సరఫరా అవుతు న్న మంచి నీటి సరఫరాను మెరుగుపరచాలని వాటర్ వర్క్స్ డీజీఎం విష్ణువర్ధన్ రావుని ఆదేశించా రు. ఈ సమస్య మళ్లీ రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జి వెంకట్ రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, నాయకులు రామిరెడ్డ్ణి పాల్గొన్నారు.