Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/బంజారాహిల్స్/జూబ్లిహిల్స్
నెలలు నిండకుండానే పుట్టిన లక్ష మంది నవజాత శిశువుల్లో ఆర్‌ఒపి (రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ) అంధత్వం రాకుండా ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వారు కాపాడారు. అట్లాస్ ఆఫ్ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అండ్ అదర్ నియోనాటల్ రెటీనా డిసేజెస్ను ఎల్విపిఇఐ విడుదల చేశారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (ఎల్విపిఇఐ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒడిశాలోని తన నెట్వర్క్ సెంటర్లలో నెలలు నిండకుండా జన్మించిన లక్ష మంంది నవజాత శిశువులలో రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ (ఆర్‌ఒపి) కారణంగా ఏర్పడే చికిత్సతో నివారించగలిగిన అంధత్వాన్ని నిర్మూలించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని అధిగమించింది. ఆర్‌ఒపి అనేది బ్ల్కెండిరగ్ ఐ డిసీజ్ 21వ శతాబ్దంలో ఇది ఒక అంటువ్యాధిగా పరిణమిస్తున్నది. నెలలు నిండకుండా ముందుగానే పుట్టిన పిల్లలు లేదా తక్కువ బరువుతో (పుట్టినప్పుడు 2 కిలోల కంటే తక్కువ) ఉన్న పిల్లల్లో ఆర్‌ఒపి అభివృద్ధి చెందే ప్రమాదం అధికం. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఈ మైలురాయిని సాధించినందుకు గుర్తుగా, 'ఎల్విపిఇఐ అట్లాస్ ఆఫ్ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అండ్ అదర్ నియోనాటల్ రెటినాల్ డిసీజెస్' పేరుతో ఎల్విపిఇఐ బృందం ఒక ప్రత్యేకమైన అట్లాస్‌ను రూపొందించింది - వైద్యులు, పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, విధాన రూపకర్తలకు ఇది ఎంతో ఉపయోగకరమైన మార్గనిర్దేశినిగా పని చేస్తుంది.