Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 మంది డీలర్లు, విక్రయదారులు అరెస్టు
- 15.2 కిలోల అల్ఫ్రాజోలం, 116 కిలోల కోడైన్ఫోస్పెట్ టానిక్‌ల స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
అక్రమంగా అల్ఫ్రాజోలం మత్తు గోలీలు, కోడైన్ ఫోస్పెట్ దగ్గు టానిక్లను విక్రయిస్తున్న డీలర్లు, స్లరుదారులపై హైదరాబాద్ నార్కొటెక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్-ఎన్ఈడబ్య్లూ), మలక్‌పేట్, కుల్సుంపురా పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15.2కిలోల అల్ఫ్రాజోలం మందులు, 116 కిలోల కోడైన్ఫోస్పెట్ టానిక్లతోపాటు నాలుగు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ. 40 లక్షలుంటుందని పోలీసులు తెలిపారు. గురువారం డీసీపీ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన పవన్ అగర్వాల్ సులువుగా డబ్బులు సంపాదించాలని మత్తు కలిగిన అల్ఫ్రాజోలం గోలీలు, కోడైన్ఫోస్పెట్ టానిక్లను అక్రమంగా సరఫరా చేయడం ప్రారంభించాడు. సులువుగా డబ్బులు వస్తుండడంతో దేశవ్యాప్తంగా అక్రమవ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్న నిందితుడు ఏజెంట్లను, డీలర్లను, సప్లరు దారులను ఎంచుకున్నాడు. వారి సహాయంతో కాచిగూడకు చెందిన జీ.పూర్ణ చందర్, మీర్‌పేట్‌కు చెందిన ఎం.మల్లేష్‌తోపాటు నగరంలోని వివిధ ప్రాంతాలల్లో ఫార్మాస్యూటికల్స్, మెడికల్ షాపుల నిర్వాహకులతో చేతులు కలిపాడు. నాంపల్లి, మెహిదీపట్నం, మలక్‌పేట్, కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా అల్ప్రాజోలం గోలీలు, దగ్గు టానిక్ కోడైన్ఫోస్పెట్ను సరఫరా చేస్తున్నారు. వాటిని ఉపయోగిస్తున్న కొందరు మత్తుకు బానిసలుగా మారుతున్నారు. సమాచారం అందుకుని వారిపై దాడులు నిర్వహించినట్టు డీసీపీ తెలిపారు.