Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
బాలాపూర్ షాహీన్ నగర్లో ఆశ వర్కర్లు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడడంతో పలువురు ఆశ వర్కర్లకు గాయాలయ్యాయి. దాంతో వారిని ఆస్పత్రికి తరలించారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ పీహెచ్సీ పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు విధి నిర్వహణలో భాగంగా ఆటోలు వెళ్తుండగా షాహిన్నగర్ కాలనీ సమీపంలో ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న పలువురు ఆశా వర్కర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే గాయపడిన వారిని ఆరోగ్య కేంద్రం వైద్యులు పట్టించుకోవడం లేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు.