Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో దోమల నియంత్రణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్, నువన్ స్ప్రే, చెరువుల్లో, కుంటల్లో ఆయిల్ బాల్స్ వేసి, వీధుల్లో స్ప్రేయింగ్ మిషన్లతో పిచికారీ చేసి దోమలవద్ధికై నియంత్రణ చర్యలు చేపట్టారు. అంటు రోగాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని, డెంగ్యూ, మలేరియా వ్యాధులకు దోమలే కారణమని, వీటి వృద్ధిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతు న్నామని అధికారులు పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో దోమల నివారణకు వీధివీధిన ఆటోల ద్వారా ఫాగింగ్ చేస్తు న్నట్టు తెలిపారు. మురుగుకాల్వలు, నాలాల్లో సానిటేషన్ సిబ్బంది పూడికతీత చేపట్టారు. చెరువులలో పేరుకు పోయిన గుర్రపు డెక్క వల్ల దోమల బెడద పెరుగు తున్నందును దానిని ఎప్పటికప్పుడు ఆధునిక యంత్ర పరికరాలతో తొలగిస్తున్నామన్నామని సానిటరీ ఇన్స్పెక్టర్ జానకి తెలిపారు. దోమలు వద్ధి చెందకుండా ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొవాలని సూచించారు. మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత దోమల నివారణకు దోహదపడుతుందని అన్నారు. ప్రజలు గహాలలో ఉన్న నీటి నిల్వలను అంటే పూల కుండీలు నీటి పాత్రలు, చెట్ల ఆకులు, కిటికీల సన్షేడ్లు, టైర్లు, ఇతర డంప్ చేయబడిన కంటైనర్లు, మెటీరియల్స్, స్తబ్దుగా ఉన్న డ్రైన్ పాయింట్లు, కూలర్లలలో నిల్వ ఉన్న నీళ్లు,తడి ప్రాంతాలు, కొబ్బరి చిప్పలు, టైర్లు, ఇతర డంప్ లలో నీరు తీసివేయడంతో పాటు నిత్యం శుభ్రంగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.