Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టూరిజం చైర్మెన్ ఉప్పల శ్రీనివాసగుప్త
నవతెలంగాణ-నాగోల్
విద్య ద్వారానే అణగారిన వర్గాలు సమాజంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని గుడికి బదులుగా బడిలో ఆధ్యాత్మికతను వెతికి విద్యాలయాలను స్థాపించి సామాజిక న్యాయం కోసం పరితపించిన విప్లవకారుడు మహౌన్నత వ్యక్తి సంత్ గాడ్గే బాబా అని రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మెన్, ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివా సగుప్త అన్నారు. గురువారం నాగోల్ డివిజన్లోని సాయి నగర్లో రజక సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పెద్దవూర బ్రహ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన సంత్ గాడ్గే బాబా 147వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందే 151 విద్యాలయాలను స్థాపించారని ,సామాజిక ఉద్యమ కారుడని, బ్రిటిష్ కాలంలోనే గ్రామాల పరిశుభ్రత కోసం తపించిన త్యాగజీవని అని కొనియాడారు. అనేక సామాజిక రుగ్మతలను ఎదుర్కొని ప్రజలను చైతన్యం చేయడం కోసం తన జీవితాంతం పాటు పడ్డాడని పేర్కొన్నారు. మహౌ న్నత శిఖరాలను అధిరోహించిన సంత్ గాడ్గే బాబా నాటి నుంచి నేటి తరం వరకు గల వారికి స్ఫూర్తిదాయ కమన్నారు. అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను, పెన్నులను పంపిణీ చేశారు .అదే విధంగా కాసేపు చీపుర్లతో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేప ట్టి రోడ్లను. శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఊర బ్రహ్మయ్యతోపాటు సాయికిరణ్ యాదవ్, ఐబీషఎఫ్ యూత్ స్టేట్ ఉపాధ్యక్షులు నరేష్ గుప్తా, కాలనీవాసులు, తదిత రులు పాల్గొన్నారు.