Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్చార్జి మల్రెడ్డి రాంరెడ్డి
- జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ -ఎల్బీనగర్
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేదవారి ప్రాణాలకు విలువలేదని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మల్ రెడ్డి రాం రెడ్డి అన్నారు. గురువారం జీహెచ్ ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జోనల్ కమిషనర్ పంకజను కలిసి వీధి కుక్కలను కట్టడి చేసి కాలనీ ప్రజలను కాపాడాలని వినతి పత్రం అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పెంపుడు కుక్క చనిపోతే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. అయితే అంబర్ పేట్ లో కుక్కల దాడిలో మరణించిన ఒక పేద బాలుడి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఒక పేదవాడి ప్రాణం ముఖ్యమంత్రి పెంపుడు కుక్క కంటే హీనమా అని ప్రశ్నిం చారు. బాలుడుపై కుక్కల దాడి ఘటనపై స్పందించిన మేయర్.. కుక్కలకు మాంసం దొరకక పిల్లలపై దాడి చేస్తు న్నాయి అనడం శోచనీయమని అన్నారు. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ మేయర్ గద్వాల విజయలక్ష్మి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మేయర్ వ్యాఖ్యలపై స్పందించకుండా గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నాడా అని అన్నారు. అంబర్ పేట్ ఘటన మరువక ముందే ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్ అపార్ట్మెంట్లో పనిచేసుకునే ఒక పేదింటి బిడ్డపై కుక్కలు దాడి చేయడం శోచనీయమని వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆం దోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా నిలబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, కుట్ల నర్సింహయాదవ్, లింగాల కిషోర్ గౌడ్,వేణు యాదవ్,రమేష్ నాయక్ ,జైపాల్ రెడ్డి,శ్యామ్ చరణ్ రెడ్డి,జానీబాబా ,బలరాం, సాయిరాం, క్రిష్ణ రెడ్డి,సంగీత, భాను, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.