Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి
నవతెలంగాణ-హయత్‌నగర్
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు కేవలం ధర్నాలు చేసి, అభివృద్ధిని అడ్డుకోవడమే కానీ, కార్పొరేటర్ స్థాయిలో రూ. 46కోట్ల నిధులు తెచ్చి, ఎవరి సహకారం లేకుండా డివిజన్‌ను అభివద్ది చేశా మని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని మన్సూ రాబాద్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అధికంగా సుమారు 120 కోట్ల రూపాయలతో ఎవరు ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తే, మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ నర్సింహ రెడ్డి మాత్రం తాను రూ. 46 కోట్లు ఎలా తెచ్చారని, 2009లో ప్రస్తుత కార్పొరేటర్ భార్య కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో కేవలం రూ. 3 కోట్లు నిధులు తెచ్చినప్పుడు ఇప్పుడు ఎలా సాద్యం అని ప్రశ్నించారు. అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, సీసీ, బీటీ రోడ్లు, శివారు ప్రాంతాల్లో అబివద్ది, పార్క్ స్థలాలకు ప్రహరీ నిర్మాణం, గ్రేవ్ యార్డ్, అండర్ పాస్, బ్రిడ్జిలు, ఆక్సిజన్ పార్క్ లాంటి అభివద్ది తెలంగాణ సర్కారు సహకారంతో స్థానిక ఎమ్మెల్యే చొరవతో జరిగిందన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి ఒక్క కాలనీకి నిధులు ఇస్తే ఆయనతో మన్సూరాబాద్ కార్పొరేటర్‌కు ఉన్న సంబంధం ఏమిటో తెలియాలని అన్నారు. ఆయన వెంట మాజీ డివిజన్ అధ్యక్షుడు టంగు టూరి నాగరాజు,ఎస్ సీ సెల్ అధ్యక్షుడు కోదండ సురేష్, ఇరిగి రమేష్,జగదీష్ గౌడ్,సాయి రామ్ గౌడ్, లింగం, దుర్గారావు తదితరులు ఉన్నారు.