Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీటీజేఏసీ నేతలు
- నామినేషన్ వేసిన చెన్నకేశవరెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహాబుబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యా య నియోజకవర్గ శాసనమండలికి జరగనున్న ఎన్నికలు ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి పరీక్ష అని తెలం గాణ టీచర్స్ జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. టీటీజేఏసీ, అధ్యా పక సంఘాలు బలపరిచిన పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి నామినేషన్ సందర్భంగా టీటీజేఏసీ చైర్మెన్ పింగలి శ్రీపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, టీటీజేఏసీ నేతలు మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నిక ఉపా ధ్యాయుల ఆత్మగౌరవానికి, కార్పొరేట్ శక్తులకు మధ్య జరిగే ఎన్నిక అన్నారు. గుర్రం చెన్నకేశవరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలని సూచించారు. పీఆర్టీ యూటీఎస్ సంఘం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాల్లో పనిచేస్తున్న ఉపా ధ్యాయ, అధ్యాపకులకు ఎన్నో సమస్యలను పరిష్కరిం చింద ని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డిని గెలిపిం చుకుని ఉపాధ్యాయ సమస్యలను శాసనమండలిలో ప్రస్తా వించి పరిష్కరించేకునే విధంగా కృషి జరగాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ, లెక్చరర్స్, కాంట్రాక్టు లెక్చరర్స్, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, గురుకుల పాఠశాలలకు సంబంధించిన 29 సంఘాల అధ్యక్షప్రధాన కార్యదర్శులు హాజరై గుర్రం చెన్నకేశవరెడ్డికి మద్దతు ప్రకటించారని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులతో భారీ ర్యాలీగా వెళ్లి అమరుల వీరుల స్థూపానికి నివాళలర్పించి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్, పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, టీటీజేఏసీ, అధ్యాపక సంఘం నేతలు అబ్దుల్లా, రాఘవరెడ్డి, విద్యాసాగర్, కనకచంద్రం, జగదీష్, దయాకర్, కుత్బుద్దీన్, దిలీప్‌రెడ్డి, రిషికేష్‌కుమార్, స్వరూప, మాలతి, ఫాతిమా, శ్రీనివాస్ హుస్సేన్ పాల్గొన్నారు.