Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర రసాయన, ఎరువుల పునరుత్పాదక, ఇంధన శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా
నవతెలంగాణ-బాలానగర్
నూతన ప్రయోగాల దిశగా కూకట్పల్లి బాలానగర్ పారిశ్రా మిక ప్రాంతంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ (నైపర్) 10వ స్నాతకోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కేంద్ర రసాయన, ఎరువుల పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుభా మాట్లాడుతూ దేశంలో ఉన్న 7 ఫార్మాస్యూటికల్ ఇనిస్టిట్యూట్స్‌లో రండో స్థానంలో నైపర్ ఉండటం హర్షించదగ్గ విషయం అన్నారు. జీవితంలో పీహెచ్డీ పట్టా పొందిన తాను తన చేతుల మీదుగా పరిశోధనాత్మక విద్యార్థులకు పట్టాలు ఇవ్వడం సంతోషకరమన్నా రు. ఉన్నత చదువుల్లో రాణించిన మీరంతా పరిశోధన పరంగా దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. నైపర్ లో చదు వుతున్న 187మంది విద్యార్థుల్లో 25మంది విద్యార్థులు (పీహెచ్ డీ)లో 162మంది విద్యార్థులు ఎంఎస్(ఫార్మ్), ఎం టెక్(ఫార్మ్), ఎంబిఎ(ఫార్మ్) చేసిన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కరోనా కష్ట కాలంలో ఇబ్బంది పడుతు న్న సమయంలో ఇలాంటి పరిషోధనాత్మక చదువులను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచినందుకు వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా:సత్య నారాయణ, చావ (లారస్ ల్యాబ్స్ ఎం డి), డా:శశి బాల సింగ్ (నైపర్ హైదరాబాద్ డైరెక్టర్) డా: శ్రీనివాస్ రావ్ (డీన్ నైపర్ హైదరాబాద్ ), విద్యార్థులు పాల్గొన్నారు.