Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని ప్రీతికి న్యాయం చేయాలనీ, నిందితుడుని కఠినంగా శిక్షించాలనీ, నిందితు డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూకట్పల్లి విభాగ్ ఆద్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో షీ టీమ్లు పేరుకు మాత్రమే ఉన్నాయనీ, విద్యార్థినులు, మహిళల పట్ల రోజుకో ప్రాంతంలో అఘాయిత్యాలు జరుగుతున్న ప్పటికీ షీ టీమ్లు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నా యన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విభాగ్ కన్వీనర్ శ్రీనాథ్, కన్వీనర్ ప్రతీక్, మేడ్చల్ జిల్లా కన్వీనర్ నగేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవన్, సిటీ వర్కింగ్ కమిటీ మెంబర్ సిటీ సనుల్ విద్యార్థి నాయకులు రాఘవేంద్ర, జమీల్, ఆయుష్, కిషోర్ తరుణ్, హితేష్ మున్నా, విద్యార్థినులు పాల్గొన్నారు.