Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
అల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ పరిధిలోని మొగులమ్మ కాలనీలో రోడ్లు, డ్రయినేజీ సమస్యలు ఉన్నాయని స్థానికులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ మొగులమ్మ కాలనీలో పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లా డుతూ మొగులమ్మ కాలనీలో పాత డ్రయినేజీ వ్యవస్థ ఉందనీ, పైప్ లైన్స్ చిన్నగా ఉండటంతో నిత్యం నిండిపో యి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలనీలో జనాభా పెరిగి నివాసాలు ఎక్కువడంతో ఇక్కడ పెద్ద డ్రయినేజీ లైన్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కాలనీలోని ప్రతి వీధిలో నూతన డ్రయినేజీ నిర్మాణం కోసం కొలతలు తీసుకుని అంచనా వ్యయాన్ని వేసి ఇవ్వాలని జల మండలి అధికారులతో ఫోన్లో మాట్లాడి సూచించారు. సీసీ రోడ్లకు కూడా ఎస్టిమేషన్ వేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తవగానే సీసీ రోడ్లు పూర్తిచేస్తామని కాలనీ వాసులకు హామీనిచ్చారు. ఎన్టీఆర్ నగర్ వాటర్ ట్యాంకర్ వద్ద ఒక గల్లీలో నూతనంగా నిర్మించాల్సిన డ్రయినేజీ, సీసీ రోడ్డుకు కూడా ఎస్టిమేషన్ వేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు జాన్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, శామ్యూల్, మహేష్, జవీద్, విజయ్, ఈశ్వరయ్య, నాయుమ్ తదితరులు పాల్గొన్నారు.