Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యార్థులు చిన్ననాటి నుంచే కష్టపడి చదివితే కలలను సాకారం చేసుకోవచ్చునని జగద్గిరిగుట్ట కార్పొ రేటర్ కొలుకుల జగన్ అన్నారు. గురువారం జగద్గిరిగుట్ట డివిజన్ బీరప్పనగర్ పైప్ లైన్ రోడ్డులో గల స్వాతి విద్యా నికేతన్ హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు సీపీఐ గ్రౌండ్స్ లో విద్యార్థుల కేరింతల నడుమ ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల కరస్పాండెంట్, చైర్మన్ నవీన్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభి ంచారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యతోనే విశ్వాన్ని జయించవచ్చు అన్నారు. విద్యతో పాటు క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించి మండల, జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో మన ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు విద్యార్థులు ఎంచు కున్న రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. స్వాతి విద్యానికేతన్ పాఠశా లలో చదివిన ఎంతోమంది ఉన్నత హౌదాలో ఉండటం గర్వకారణం అని యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు చేసిన సాంస్క తిక ప్రదర్శనలు మంత్ర ముగ్ధులను చేశాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, మాజీ కార్పొ రేటర్ గుడిమెట్ల సురేష్‌రెడ్డి, బస్తీ నాయకులు మజ్జి శ్రీనివాస్‌రావు, మజ్జి శరత్‌కుమార్, కన్ని, శివాజీ, సంతోష్ పాల్గొన్నారు.