Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్‌నగర్ 130 డివిజన్ పరిధిలోని పార్క్సాగర్ వద్ద ఒడిషా జగన్నాథ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యజ్ఞజియా ఆహుతి, నిత్య హరినామ సంకీర్తన కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి తో కలిసి పాల్గొని జగన్నాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలను ఆదుకుంటుందన్నారు. తెలంగాణలో గల ఒరిస్సా వాసులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే బాధ్యత తమదన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా నా వంతు సహకారం పూర్తిగా ఉంటుందని హామీనిచ్చారు. సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పొలే శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి శివాజీ, పద్మావతి, లక్ష్మి, శేషు, శేఖర్, ఇస్మాయిల్, పద్మజ రెడ్డి, జగన్నాథ్ స్వామి ఆలయ అసోసియేషన్ సభ్యులు, అధ్యక్షులు, బంబెల్ దాసు ఒరిస్సా వాసులు, మహిళలు పాల్గొన్నారు.