Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలనీ, లేకుంటే చర్యలు తీసుకుంటామని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కాంట్రాక్టర్లను కొలుకుల జగన్ హెచ్చరించారు. శుక్రవారం డివిజన్ పరిధి శ్రీనివాస్ నగర్, రింగ్ బస్తీలలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఆయా బస్తీ వాసులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాజకీయాలకు అతీతంగా డివిజన్ ప్రజల సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలనీ, వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీర్ఎస్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్, మాజీ వార్డు సభ్యులు దూడల పాపులు గౌడ్, శ్రీనివాసనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు శేషాని నర్సింగ్ గౌడ్, స్థానికులు పాల్గొన్నారు.