Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుతుబుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని బివీఆర్ఐటి హైదరాబాద్ మహిలా ఇంజినీరింగ్ కళాశాలలో 9వ జాతీయ స్థాయి విద్యార్థుల సాంకేతిక ఉత్సవ మేధాన్వేష్-2023 రెండు రోజుల వేడుకలు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిధులుగా శ్రీ సృజనా శ్రీ వాత్సవ డైరెక్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎక్స్పీరియన్, డాక్టర్ నిమ్మి రంగస్వామి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఆచార్యులు హాజరై విద్యార్థు లను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో ఈనాడు అనేక రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం తెలుపుతూ అట్టి అవకా శాలను సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించడానికి వినియో గించుకోవాలని తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కెవిఎన్ సునీత మాట్లాడుతూ మేధాన్వేష్ ప్రతి ఏడాదీ గొప్ప వేదికగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గెలుపోట ములకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు. మేదన్వేష్ కన్వీనర్ డాక్టర్ అన్వర్ భాషా పఠాన్ సాంకేతిక వివరిస్తూ విభిన్న సాంకే తిక పోటీల్లో గూర్చి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు ఆచార్యులు విద్యార్థులు ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.