Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
మైసమ్మగూడలోని నర్సింహరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం పేటెంట్స్పై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం ఐఐసీ5.0, సిఎస్ఈ భాగస్వామ్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా.దాసరి అయోధ్య ఎగ్జామినర్ గ్రూప్ ఎ గెజిటెడ్ ఆఫీసర్ ఐపిఆర్ చెన్నై హాజరై మాట్లాడారు. నేటితరం సాంకేతికతకు పేటెంట్స్ ఎంతో అవసరమన్నారు. పేటంట్స్ ఆవశ్యకతను, ప్రాముఖ్యతను, విద్యార్థులకు వివరించారు. తద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందించడం ద్వారా సమాజానికి ఉపయోగపడే వారిగా విద్యార్థులను నైపుణ్యవంతులుగా తయారు చేయవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జె.నర్సింహరెడ్డి, కార్యదర్శి జె,త్రిశూల్ రెడ్డి, కోశాధికారి జె త్రిలోక్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డా.ఆర్.లోకనాథం, డీన్ వెంకట్రావు, కన్వీనర్ కే.సురేష్, డా.ఎం.శోభన్, పి.దిలీప్ కుమార్ రెడ్డి, రవీంద్ర రామన్, ఎన్.శ్రీనివాసరావు, వివిధ విభాగాధిపతులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.