Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రింటర్స్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రింటింగ్ యంత్ర పితామహులు జోహన్నెస్ గూటెన్ బర్గ్ జయంతి సందర్భంగా శుక్రవారం సికింద్రాబాద్ సోమ సుంద రం వీధిలోని ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థా పకులు మక్తాల జలంధర్ గౌడ్ మాట్లాడుతూ.... చరిత్రను భావి తరాలకు అం దించే ప్రింటింగ్ రంగ కార్మికుల సంక్షే మానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను రూపొందించాలని కోరారు. కాలగర్భంలో కలిసిపోయే ఎన్నో తాళ పత్ర గ్రంథాలను, పురాణ, ఇతిహాస గ్రంథాలను అక్షర రూపంలో ముద్రించి భావితరాలకు అందించేందుకు ప్రింటింగ్ యంత్రం ఉపయో గపడుతుందని, అలాంటి ప్రింటింగ్ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు జరుగు తున్నాయని అందుకు అనుగుణంగా ప్రింటింగ్ కార్మికులు తమ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మూర్తి, ప్రకాష్, శ్రావణ్, అశోక్, సతీష్, శ్రీనివాస్, రామ్మోహన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.