Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
- సీఎస్తో వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రభుత్వ ఆదేశాలు, సూచనలు తప్పకుండా పాటిస్తామని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76 ప్రభుత్వ జీవోల ప్రకారం చేయాల్సిన క్రమబద్దీకరణ, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ అంశాలపై మాట్లాడారు.
అనంతరం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ మాట్లాడుతూ... ప్రభుత్వం సూచించిన మేరకు అన్ని రకాల కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభు త్వ ఉత్తర్వులు (జీవో) 59, 118కి సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 59 జీవోకు సంబం ధించి మార్చి నెలాఖరు వరకు పూర్తిగా క్లియర్ చేస్తామని కలెక్టర్ అన్నారు. అలాగే 118 జీవోకు సంబంధించి మార్చి 10వ తేదీ వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వ కార్యక్ర మాలు విజయవంతమయ్యేలా ఆయా శాఖల జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.