Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజాపూర్ గ్రామస్తులు
- భూమిని స్వాధీనం చేసుకోవాలని ధర్నా
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయాంజల్ మున్సిపాల్టీ ఇంజపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 7 గ్రామ కంఠం లో 66 గుంటల స్థలంలో 36 గుంటల భూమి కాంగ్రెస్ నాయకులు గుండ్ల పల్లి ధన్ రాజ్ గౌడ్‌కు చెందిందని, మిగిలిన 30 గుంట ల స్థలం భూమిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ధనరాజ్ కబ్జాకు పాల్పడుతున్నాడని, కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ శుక్రవారం ఇంజాపూర్ గ్రామస్తులు ఇంజాపూర్ హయత్ నగర్ రహదారిపై ధర్నా నిర్వహించారు. కమిషనర్ కు, ఎమ్మార్వోకు, కబ్జా దారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ స్తులు మాట్లాడుతూ గ్రామకంఠం భూమి కబ్జాకు గురైన విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి, అధికారుల దష్టికి తీసుకెళ్లి నప్పటికీ అట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇట్టి స్థలంలో సిరీస్ కెమికల్ ఫ్యాక్టరీ మట్టి పోయడంతో గ్రామంలోని చిన్న పిల్లలు, పెద్దలు అనారోగ్యం పాలవుతున్నారని తెలియజేశారు. కబ్జా చేసిన 30 గుంటల భూమి చుట్టూ హద్దు ఏర్పాటు చేసి నూతన ప్రైమరీ స్కూల్ నిర్మించడానికి ఉపయోగించాలని వారు డిమాండ్ చేశారు.
కబ్జాకు పాల్పడిన వారిని నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని సీపీఐ (ఎం) జిల్లా నాయకులు బి.సామెల్ డిమాండ్ చేశారు. గ్రామస్థులు చేసిన ధర్నాకు
సీపీఐ(ఎం) తరుపున మద్దతు తెలిపారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ధర్నా ను విరమించేదిలేదని, గత మూడు రోజుల క్రితం కమిషనర్ దృష్టి కి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశా రు. అయితే సిరీస్ కంపెనీ నుండి తెచ్చి పోసిన మట్టిన తొలగింప చేస్తామని, దీనిపై కాలుష్య నియంత్రణ మండలికి తెలియజేశామని కమిషనర్ సాబేర్ అలీ తెలిపారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఏండగా గ్రామ కంఠ భూమిని కబ్జా చేయలేదని అది తమ తాత ముత్తాతల నుంచి తమ ఆధీనంలో ఉన్నదని, కావాలనే కొంత మంది తమపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తు న్నారని, వైస్ చైర్ పర్సన్ హరిత ధన్ రాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నోముల కష్ణ గౌడ్, కౌన్సిలర్ బొక్క రవీందర్ రెడ్డి, నాయకులు పిట్టా సుదర్శన్ రెడ్డి, బొక్క గౌతమ్ రెడ్డి, బొక్క మురళీ ధర రెడ్డి, కమలాకర్ రెడ్డి, నోముల కార్తిక్ గౌడ్, నర్సింహ చారి, కృష్ణ చారి, సందీప్ చారి తదితరులు పాల్గొన్నారు.