Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
అధికార బలంతో ఓ కార్పొరేటర్ బెదిరింపులకు పాల్పడుతూ, చంపుతానని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడంటూ ఓ ఎస్టీ నాయకుడు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లిలో నివాసముంటున్న శ్రీను నాయక్ వ్యాపారం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ విభాగంలో ప్రదానకార్యదర్శిగా కొనసాగుతూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు విజయవంతంలో తనదైన పాత్ర పోషించాడు. అయితే తాను సంఘం కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించడం, పలువురి మెప్పు పొందడం, కాకతీయనగర్ కాలనీ కమాన్ వ్యవహారం వివాదాస్పదం కావడం జీర్ణించుకోలేని 2వ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ నాయక్ తనను ఇష్టానుసారంగా బూతులు తిడుతూ, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడి భయబ్రాంతులకు గురి చేశాడని శ్రీను నాయక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన డివిజన్లో కలగజేసుకోవద్దని,కాలనీలలో తిరిగితే అంతు చూస్తానంటూ ఫోన్ లో బెదిరింపులకు గురి చేశాడని విలేకరులకు వివరించాడు. ప్రజల ఓట్లతో గెలిచి పదవులు అనుభవిస్తూ ప్రజలపైకి బెదిరింపులకు పాల్పడటం ఏందని ప్రశ్నించాడు. గుండాలాగ ప్రవర్తిస్తున్న కార్పొరేటర్ తో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మమ్మల్ని ఆదుకోవాలని కోరాడు..