Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ నాయకులు ఎండీ సలీం
నవతెలంగాణ-సరూర్నగర్
శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారన్ని అందిస్తే ప్రజలు తప్పక ఆదరిస్తారని బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ మైనార్టీ నాయకులు ఎండి సలీం అన్నారు. సరూర్ నగర్ డివిజన్లోని శ్రీ వెంకటేశ్వర కాలనీ -రోడ్ నెం 8 లో ఎండి వసీమ్ ఖాన్ నూతన స్పైసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ముఖ్య అతిథులుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఉద్యోగం అని ఆలోచించకుండా సొంత కాళ్లపై నిలబడే విధంగా వ్యాపారం చేసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రెటరీ సుదర్శన్ ముదిరాజ్ , యశ్వంత్ రెడ్డి , ఆరుట్ల కిరణ్, సుధాకర్, సోషల్ మీడియా మొగిళ్ళ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.