Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీనగర్
నియోజకవర్గ నిధులను వినియోగించడంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విఫలమయ్యాడని బీజేపీ రంగా రెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి అన్నారు. ఓంకార్, నిర్మల దేవి శక్తి కేంద్రాల ఇన్చార్జి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన శక్తి కేంద్ర కార్నర్ సమావేశానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, సామ రంగారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సామ రంగా రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కార్పొరేటర్ల విషయంలో ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలకు పోతున్నారన్నారు. జీహెచ్ఎంసీని దివాళా తీయించిన దగాకోరు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు. రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం కోసమే అధికార పార్టీలోకి పోతున్నట్టు చెప్పిన ఎమ్మెల్యే ఈ విషయంలో అడుగడుగునా అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. సమస్య పరిష్కరించకుంటే పదవికి రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మోసం చేయడం కోసమే తప్పుడు 118 జీవోను తీసుకొచ్చారన్నారు. ఆ తప్పుడు జీవోను తీసుకొచ్చినందుకే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సన్మానాలు, అభిషేకాలు చేయించుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇపుడు మళ్లీ సవరణలతో కూడిన 118 జీవోను తీసుకొస్తున్నామని మరో నాటకానికి ఎమ్మెల్యే తెర తీశాడన్నారు. కేంద్ర ప్రభు త్వం నుంచి వచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రాష్ట్ర ప్రజలకు అందకుండా చేసిన దుర్గార్గపు చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరు పన్నులు ఫుల్ అభివృద్ధి పనులు నిల్ అన్న చందంగా ఉందన్నారు. 58, 59 జీవోల ద్వారా పేదల నుంచి ముక్కు పిండి మరీ డబ్బు లు వసూలు చేసి ఖజానా నింపు కోవాలనే దుర్మార్గపు ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలు రూ.5 లక్షల వరకు ప్రభుత్వ, ప్రయివేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యాన్ని పొందవచ్చన్నారు.ఈ కార్యక్ర మంలో జయ ప్రకాష్, ఆనంద్ కుమార్, రామ్ రెడ్డి, లక్ష్మి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి , శరత్, శివ రామ్ , సాయి వివేక్ , త మ్మిశెట్టి వివేక్ ,పళ్ళ శ్రీ లక్ష్మి, జయ, లక్ష్మి పాల్గొన్నారు.