Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
దేవాలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించేందుకు చర్యలు మరింత ముమ్మరం చేసినట్టు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కే. బాలాజీ రాజు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిజిగేటెడ్ అధికారి సుదర్శన్ రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి తో కలిసి వారు శుక్రవారం శివాజీ నగర్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానాన్ని సందర్శించారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం దేవాలయాలకు జీహెచ్ఎంసి జారీ చేస్తున్న ఫుడ్ లైసెన్స్‌ను ఆలయ ఈవో కే. పి. సత్యమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీ రాజు మాట్లా డుతూ.. నగరంలోని ఆలయాల్లో భక్తులకు శుభ్రమైన ప్రసా దాలు అందించే లక్ష్యంతో ప్రసాదల నాణ్యతకు సంబంధించి ఐదు అంశాలను పరిగణలోకి తీసుకొని లైసెన్సులు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏఎఫ్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రవేశపెట్టిన భోగ్ (బ్లిస్ ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్) పథకంలో భాగంగా దేవాలయాలకు లైసెన్స్‌ల జారీ చేపట్టామని తెలిపారు. ఇప్పటికే నగరంలో సుమారు 10 దేవాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇటీవల బల్కంపేట శ్రీ పోచమ్మ దేవాలయానికి అందజేశామని, శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవస్థానానికి లైసెన్స్ అందజేశామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సారథి, మనివనన్, ఆలయ సిబ్బంది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.