Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
గతేడాది రాష్ట్ర పురపాలక,ఐటి శాఖ మంత్రి కేటీఆర్ చే శంకుస్థాపన జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిడి శూరకర్ణ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో అన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నదని, వరద కాలువ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నంచారు. మంత్రి చేసిన శంకుస్థాపనకే దిక్కు లేదని బడంగ్ పేట మూడో డివిజన్ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. రూ. 24 కోట్ల నిధులతో నిర్మించనున్న డ్రయినేజీ నాలా పనులు ఎందుకు ఆగిపోయాయో సమాధానం చెప్పాలని శూర కర్ణ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి దూసుకుపోతుందని చెప్పే పాలకుల మాటలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన లేకుండా పోతుందని కాలనీవాసులు గుసగుస లాడుకుంటున్నారని తెలిపారు. డ్రయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్పుడు 9నెలల్లో పూర్తి చేయాలని అధకారులను మంత్రి ఆదేశించినా నేటికీ పనులు పూర్తి కాలేదన్నారు. రానున్న వర్షాకాలాన్ని దష్టిలో పెట్టుకొని ఈ పనులు తక్షణమే పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నా రన్నారు. సి.ఎం.ఆర్ కాలనీ, సి.వై.ఆర్ కాలనీ, బోయపల్లి ఎన్క్లేవ్, బీ ఎస్ ఆర్, న్యూ మధురాపురి కాలని, నవార్ జంగారెడ్డి కాలనీ, రామిడి మల్లారెడ్డి నగర్ కాలనీ వాసులు డ్రయినేజీ పనులు పూర్తి కాక తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నట్టు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వానాకాలం రాకముందే నాలా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.