Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలోని జెడ్పీ రోడ్డులో గల వై జంక్షన్ వద్ద గత ఎనిమిది సంవత్సరాలుగా వీర శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఉత్సవాలను డివిజన్ ప్రజల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నామని బీజేపీ డివిజన్ అధ్యక్షులు పి నరేష్ యాదవ్ అన్నారు. గత కొంతకాలంగా ఫ్లెక్సీలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, కొన్ని రోజుల క్రితమే శివాజీ జయంతి వేడుకల సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే రాత్రికి రాత్రే జీహెచ్ఎంసి అధికారులు విగ్రహాన్ని తొలగిం చారని ఆరోపించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు ఇలా చేయడం దుర్మార్గమని నరేష్ యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. అదే ప్రదేశంలో తిరిగి శివాజీ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వారు జీహెచ్ఎంసి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నర్సింగ్ రావును వారి కార్యాలయం లో కలిసి వినతిపత్రం అందజేశామని వారు తెలిపారు. చంపాపేట కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి,మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసిం హారెడ్డి, గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ మహేశ్వర్ రెడ్డి సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, ఆరుట్ల సురేష్, బీరం అమరేందర్ రెడ్డి, రాధాకృష్ణ సురేష్, మహేందర్, జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.