Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
జల్పల్లి మున్సిపల్ అభివద్ధికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు జీ.రంజిత్ రెడ్డి రూ. 2.87 కోట్ల నిధులు మంజూరు చేయటం పట్ల పహడి షరీఫ్ 13వ వార్డు కౌన్సిలర్ పుష్పమ్మ కొండల్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడి యాతో కౌన్సిలర్ మాట్లాడుతూ అభివృద్ధిలో జల్ పల్లి మున్సిపల్ వెనుక బడ ిఉందని అందుకోసం ఎం.పి.రంజిత్ రెడ్డి ప్రత్యేక నిధులు మంజూరు చేయిం చారన్నారు. పహాడీషరీఫ్ వాసులు తరపున చేవెళ్ల ఎంపీకి ధన్యవాదాలు తెలి పారు. రూ. 2.87 కోట్లతో పాటు మరో రూ. 35 లక్షల నిధులు 13వ వారు ్డ(పహాడీషరీఫ్)లో సీసీ రోడ్డుకు కేటాయించినందుకు స్థానిక కౌన్సిలర్ పందెం కొం డల్ యాదవ్, మహ్మదీయ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హమీద్ ఖాన్, మాజీ వార్డు మెంబర్లు ఖదీర్, సూర్యకుమార్ గౌడ్, నాయకులు విక్రాంత్ గౌడ్, విశాల్ గౌడ్, మినాజ్, ఇస్మాయిల్, ఆమెర్, అవేజ్ లు ఎంపీ రంజిత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పూలబొకేను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.