Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
మహిళా అభ్యున్నతికి ఉద్యమించిన ధీరోదాత్త నారి ఈశ్వరీబాయి అని సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ కొనియా డారు. రవీంద్రభారతి ప్రధాన వేదిక పై రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ జె. ఈశ్వరీ బాయి ట్రస్ట్ నిర్వ్యహణ లో ఈశ్వరీబాయి 32 వ వర్ధంతి సందర్భం గా ఆమె పేరిట ఏర్పరచిన స్మారక పురస్కారాలను శుక్రవారం గాంధీ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు,సామజిక వ్యాపారవేత్త వనజాక్షి నర్రా,ప్రొఫెసర్ వెంకట రత్నం, డాక్టర్ కరుణ దేవి లకు వారు బహు కరించి మాట్లాడారు ఈశ్వరీబాయి స్వయంకృషితో రాజకీయ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగిన నేత అన్నారు సామజిక వివక్షత,తెలంగాణ ప్రాంతం పట్ల నాటి పాలకుల నిర్లక్ష్యం, మహిళ లపట్ల చిన్న చూపునకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రగతి శీలి ఈశ్వరిబాయి అన్నారు. ప్రొఫెసర్ సుధారాణి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.