Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఆలయాల అభ్యున్నతికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ జై జవాన్ కాలనీలో గల పురాతన శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆలయానికి ఆయన నగదు విరాళాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుషాయిగూడ, కాప్రా, ఎల్లారెడ్డి గూడా దమ్మా యిగూడ ప్రాంతాల ప్రజలకు ఆరాధ్య పురాతన దైవమైన శ్రీ విజయ దుర్గ అమ్మవారి కైంకర్యం ఎంతో అద్భుతమైనది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చీఫ్ అడ్వైజర్ వడ్లోజు జ్యోతిర్మయా చారి, కమిటీ ప్రధాన కార్యదర్శి పత్రి శ్రీనాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.