Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
సద్గురు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాలను జేఎన్టీయూహెచ్ వర్సిటీలో వర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. ఈ ఉత్సవాలకు వైస్ చాన్స్ లర్ కట్ట నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూరు హుస్సేన్, రెక్టార్ ఎ.గోవర్ధన్, ప్రిన్సిపల్ జయ లక్ష్మి యాదద్రి టెంపుల్ ఆర్కిటెకట్ మోతీలాల్ నాయక్ హాజరై సంత్ సేవాలాల్ కి భోగ్ బండరో నిర్వహించి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ కట్టా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ త్యాగానికి యావత్ బంజారా సమాజం రుణపడి ఉంటుందన్నారు. ప్రజల మేలు కోసం సేవాలాల్ మహారాజ్ అనేక ఉద్య మాలు చేశారని,ఆదర్శవంతమైన ఆయన జీవితాన్ని అంద రూ యువతి యువకులు ఆచరించాలన్నారు. నిస్వార్థంగా సమాజ హితమే లక్ష్యంగా జీవితాంతం సేవాలాల్ పనిచేశా రని చెప్పారు. బంజారా యువతులు బంజారా సంప్రదాయ డ్రెస్ ధరించి డాన్స్ చేశారు. కార్యక్రమానికి బంజారా దుస్తులు ధరించిన యువతులు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్స్ బాలు నాయక్, రుప్సింగ్ నాయక్, రంజీ,నరసింహ, సైదా, బలరాం నాయక్, సమ్ములాల్, విద్యార్ధులు భాను ప్రకాష్ నాయక్, సభావత్ శ్రీను నాయక్, కరణ్ రాహుల్,ప్రణీత,రంజనా, తేజస్విని, రాము, శ్రీనివాస్, భరత్, హారిక, సానియా, పూజా తదితర విద్యార్థులు, పాల్గొన్నారు.