Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సై మురళీధర్
- హాస్టల్ విద్యార్థులకు అవగాహన
నవతెలంగాణ- మేడ్చల్
సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తతో ఉండాలని మేడ్చల్ ఎస్సై మురళీధర్ అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని హాస్టల్స్లో ఉండే విద్యార్థులకు సైబర్ నేరాలపై మేడ్చల్ పోలీస్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, గూగుల్ కస్టమర్ కేర్ నెంబర్ ఫ్రాడ్, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్, న్యూడ్ వీడియో కాల్ ఫ్రాడ్, రెంటల్ యాప్ ఫ్రాడ్, క్వీక్ సపోర్ట్ డెస్క్ రిమోట్ అప్ డౌన్ లోడ్ ఫ్రాడ్, క్యూ ఆర్ కోడ్ ఫ్రాడ్, కేబీసీ లాటరీ ఫ్రాడ్ వంటి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే విద్యార్థులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ,వెహికల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్,ట్రిబుల్ రైడింగ్ వంటి విషయాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు.