Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-కూకట్పల్లి
నేర శోధన, నేర నివారణలో నిఘా నేత్రాలు ఎంతగానో తోడ్పడతాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటపాపయ్య నగర్లో సీడీపీ ఫండ్స్, కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మూడు లక్షల అరవై మూడు వేల నిధుల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు వెంకట పాపయ్య నగర్ కాలనీ వాసులు ముందుకు రావడం చాలా అభినందనీయం, స్ఫూర్తిదాయకం అన్నారు. ఇతర బస్తీ, కాలనీ వాసులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అవసరమైతే అదనపు కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి తన వంతు ఆర్థిక సహాయం చేస్తానని, దూరదష్టితో బస్తీలలో సైతం భద్రత, ప్రజల రక్షణ ధ్యేయంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పారు. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కషి చేస్తున్నారని ,సీసీ కెమెరాల ఏర్పాటుపై కాలనీ వాసులకు విస్తత ప్రచారంతో అవగాహన కలిపిస్తున్నారని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలిసులతో సమానమని అన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కషి గా ఎమ్మెల్యే ఫండ్ (సీడీపీ) ద్వారా రూ. 1 కోటి కేటాయించడం జరిగిందని తెలిపారు. 24 గంటల పాటు నిరంతరం పనిచేసే నిఘా నేత్రలను ప్రతి కాలనీ, బస్తీలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే కాలనీలో ప్లాస్టిక్ నిషేధించాలని, బెస్ట్ కాలనీ అవార్డ్ వచ్చేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి ,మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, నాయకులు దొడ్ల రామకష్ణ గౌడ్, కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్,వాసుదేవరావు, పోశెట్టి గౌడ్, వెంకటేష్ గౌడ్, రమేష్ గౌడ్, నరసింహ, రాములుగౌడ్, సాయి గౌడ్, కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామదాసు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.