Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసినగర్ కాలనీ లో రోడ్లు, డ్రయినేజీ సమస్యలు ఉన్నాయని స్థానిక ప్రజలు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకు రాగా, కార్పొరేటర్ తులసినగర్ కాలనీలో పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించారు. తులసినగర్ కాలనీలో డ్రయినేజీ వ్యవస్థ చిన్నగా ఉండడంతో నిత్యం నిండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాలనీలో నివాసాలు పెరిగినందున ప్రజల అవసరాల దష్ట్యా కాలనీ లోని ప్రతి వీధిలో నూతన డ్రయినేజీ నిర్మాణం కోసం కొల తలు తీసుకుని అంచనా వ్యయాన్ని వేసి ఇవ్వాలని జల మం డలి అధికారులతో కార్పొరేటర్ ఫోన్లో మాట్లాడి సూచిం చారు. అలాగే సీసీ రోడ్లకు కూడా ఎస్టిమేషన్ వేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాలనీలోని ఒక వీధిలో రోడ్డు మీదకు పొంగుతున్న డ్రయినేజీ సమస్యను అత్యవసర పనుల్లో చేర్చి త్వరగా పరిష్కరించే విధంగా చూస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, రాజా నరేందర్ రెడ్డి, సుండు యాదగిరి, యడ్ల సత్యనారాయణ, అంకాల రాజు, బాలరాజు, సత్యనారాయణ, శేఖర్, అనిల్, శ్రీనివాసరావు, గోపాల్ యాదవ్, మధుబాబు, కేశవ్, లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.