Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
సిద్దిపేట పట్టణంలో జరుగుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 2023 జాతీయస్థాయి కరాటే పోటీలలో మేడ్చల్ పట్టణానికి చెందిన యూనివర్సల్ 369 కరాటే విద్యార్థులు వివిధ విభాగాలలో గోల్డ్ మెడల్ బహుమ తులు సాధించారు. ఇందులో అండర్ 10 ఇయర్స్ కటాస్ విభాగంలో వినీషా, విజేత, తన్విక, అక్షిత గోల్డ్ మెడల్ గెలుపొందారు. అండర్ 12 ఇయర్స్ కుమ్మితే విభాగంలో జి వరుణ్ తేజ్, తబ్రేజ్, అభిరామ్, చైతన్య, మణికత్, అర్జున్ గోల్డ్ మెడల్స్ సాధించగా సాయి జశ్వంత్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. అండర్ 14 ఇయర్స్ కుమ్మితే విభాగంలో బిట్టు,షానా రోజ్లిన్ గోల్డ్ మెడల్ గెలుపొందగా కిట్టు సిల్వర్ మెడల్ సాధించాడు. అండర్ 16 ఇయర్స్ కుమ్మితే విభాగంలో ఇన్నోక్షణ్, అనిల్, జాహ్నవి,మున్నా కుమార్ గోల్డ్ మెడల్ గెలుపొందగా అనుప్ రాజ్, మేఘన, వైష్ణవి సిల్వర్ మెడల్ సాధించారు. వీరందరిని మార్చి 28, 29వ తేదీలలో గోవాలో నిర్వహించే ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు తీసుకెళ్లడం జరుగుతుందని యూనివర్సల్ 369 కరాటే ఫౌండర్ ఇండియా చీఫ్ గడ్డం సాయికుమార్ తెలి పారు. మేడ్చల్ పట్టణానికి వన్నె తీసుకు వచ్చినటువంటి విెద్యార్థులకు గడ్డం సాయికుమార్, కోచ్ లు జి అక్షయ, జి మంజుశ్రీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పాన్సర్స్ ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్ షిప్ తీసుకువస్తామని తెలిపారు.