Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
మూసాపేట సర్కిల్ ఫతేనగర్ మాదిగ సంక్షేమ సంఘం సమావేశం ఆదివారం ఫతేనగర్‌లోని కార్యాల యంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి సంఘం ప్రధాన కార్యదర్శి జీడిమడ్ల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఫతేనగర్ మాదిగల అభివృద్ధి కోసం డివిజన్ స్థాయి మాదిగ సంక్షేమ సంఘం 2014లో స్థాపన చేయడం జరిగిందని మాదిగ సంక్షేమ సంఘం సలహా దారులు కామ్రేడ్ సత్యం, అధ్యక్షులు జిలకర యాదగిరి మరణానంతరం కమిటీని ఎన్నుకోలేదన్నారు. కావున నూతన కమిటీని ఎన్నుకోవాలని మాదిగ ప్రజలు, వారి కుటుంబాలు నూతన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సంఘ సభ్యులు అందరూ కలిసి గతంలో ఉన్న సంఘాన్ని రద్దు చేసి నూతన చైర్మెన్ గా గోల్కొండ సతీష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో మాదిగ సంక్షేమ సంఘానికి చైర్మెన్‌గా ఎన్నుకున్నందుకు ఫతేనగర్ మాదిగ ప్రజలకు కతజ్ఞతలు తెలియజేశారు. మాదిగల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి రావలసిన సంక్షేమ పథకాలను పీడిత వర్గాలకు అందే విధంగా కషి చేస్తానని, మాదిగలు పారిశ్రామికంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా వారి భవిష్యత్తును అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి రావలసిన సంక్షేమ పథకాలన్నీ మాదిగలకందే విధంగా అనేకమైన అభివద్ధి కార్యక్రమాలను చేపడతానని తెలియజేస్తున్నాను. అనం తరం పూర్తి కమిటీని ప్రకటిం చారు. చైర్మెన్‌గా గోల్కొండ సతీష్, సభ్యులుగా మర్రి కిషన్ మెంబర్, జీడిమడ్ల సత్యనారాయణ, సదానంద్, ఎం కిరణ్ (హరిజన బస్తీ అధ్యక్షులు), చిటకోరు నరేష్, హరిబాబు, ఎల్లం, శివ, దత్తు, యాదగిరి, కిరణ్, మదు, ప్రవీణ్, శ్రీనివాస్, మల్లేష్, నగేష్, బాలరాజ్, శివ ఉన్నారు.